రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

HNK: కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే జంక్షన్ ఆవరణలో గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని 15.2 కిలోల శుద్ధి చేసిన గంజాయిని పట్టుకున్నారు. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం రెండవ నెంబర్ ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రూ.3.80 లక్షల గంజాయి పట్టుకున్నారు.