ఉచితంగా విత్తనాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం డొంకలపెర్త గ్రామ సచివాలయంలో పొలం గట్లపై నాటుకునేందుకు కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ సహాయకులు ఏ. లావణ్య శనివారం తెలిపారు. సచివాలయం పరిధిలో ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.