మా కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి

VZM: భోగాపురం మండలం రావాడ ఎస్సీ కాలనీలో అపారిశుధ్యం తాండవిస్తోందని కాలనీవాసులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. సైడ్ కాలువల్లో పూడిక పెరిగిపోయి దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. తక్షణమే అధికారులు తమ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.