సమ్మె విరమించిన నెట్‌వర్క్ ఆస్పత్రులు

సమ్మె విరమించిన నెట్‌వర్క్ ఆస్పత్రులు

AP: NTR వైద్య సేవ ట్రస్ట్ ఆస్పత్రులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. 10 రోజుల్లో రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. కాగా రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఈ నెల 1 నుంచి నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.