అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NLR: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలను పోలీసులు వెలికితీసే పనిలో ఉన్నారని, తప్పుడు వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ మంగళవారం తెలిపారు. కుల, మత, రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అన్నారు.