పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పీ

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పీ

SKLM: జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది తమ సమస్యలను నేరుగా ఎస్పీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.