అవినీతి ఆరోపణలపై బాన్సువాడ కానిస్టేబుల్ సస్పెండ్

అవినీతి ఆరోపణలపై బాన్సువాడ కానిస్టేబుల్ సస్పెండ్

KMR: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ భుక్య శ్రీనును ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం సస్పెండ్ చేశారు. కోర్టు కేసులకు సంబంధించి వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలడంతో చర్యలు తీసుకున్నారు. శాఖలో అనైతిక చర్యలు, అవినీతి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.