బాధిత కుటుంబాన్ని ఆదుకున్న వెలుగు సిబ్బంది

బాధిత కుటుంబాన్ని ఆదుకున్న వెలుగు సిబ్బంది

AKP: అచ్యుతాపురం మండలం ఖాజీపాలెంలో వెలుగు వీఓఏగా పనిచేస్తూ గత నెల 25న మృతి చెందిన కే.రేణుక కుటుంబాన్ని వెలుగు సిబ్బంది ఆదుకున్నారు. వీఓఏలు, సీసీలు ఏపీఎంలు కలిసి రూ.2.22 లక్షలు విరాళాలు సేకరించారు. ఆ మొత్తాన్ని శనివారం డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏల రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపా దేవి పాల్గొన్నారు.