VIDEO: హోటల్ భోజనంలో జెర్రీ కలకలం.!
నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో భోజనంలో జెర్రీ రావడం కలకలం రేపింది. బాధితుడు భైంసాకు చెందిన బాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మిత్రులతో కలిసి ఉడిపి హోటల్లో భోజనం చేసే క్రమంలో అందులో జెర్రీ వచ్చింది. ఈ విషయాన్ని హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు.