సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
SRPT: మునగాల మండలం విజయరామపురం మలుపు వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒక యువకుడు పడిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.