మౌలిక సదుపాయాలు పరిశీలించిన కమిషనర్
KNR: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 'సంక్షేమ వారోత్సవం' నిర్వహించారు. కరీంనగర్ కాశ్మీరగడ్డ ఎస్సీ హాస్టల్లో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నప్పుడే చదువుపై శ్రద్ధ చూపగలరని ఆయన పేర్కొన్నారు. హాస్టల్ గదులు, మౌలిక వసతులను పరిశీలించారు.