మద్యం మత్తులో రైలు కిందపడి వ్యక్తి మృతి

మద్యం మత్తులో రైలు కిందపడి వ్యక్తి మృతి

ADB: తాంసి మండలంలో ఉదయం రైలు కిందపడి ఓ వ్యక్తి మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్ మద్యం మత్తులో మంగళవారం ఉదయం గ్రామ శివారులో రైల్ కింద పడి మరణించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్నీ రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.