వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన

NLG: చిట్యాల మండలం వనిపాకల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ నల్లగొండ వ్యక్తిత్వ వికాసంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు బాల్యదశ నుండే క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలని లయన్ ఏదుల్ల అంజి రెడ్డి సూచించారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు అంజిరెడ్డి డైరీలను బహుకరించారు.