VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవాయిద్యాల మధ్యకళాకారులు త్యాగరాజ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, శేషం కిష్టయ్యల చిత్రపటాలను పట్టుకొని పురవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.