కందకుర్తి బ్రిడ్జిని పరిశీలించిన సీపీ

NZB: రెంజల్ మండలంలోని కందకుర్తి (త్రివేణీ సంగమం) సమీపంలోని బ్రిడ్జిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిజాంసాగర్ కెనాల్ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. అదే విధంగా ఆయన పుష్కర ఘాట్‌ను తనిఖీ చేశారు. పరీవాహక ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.