'ఆపదలో ఉన్నవారికి అండగా కూటమి ప్రభుత్వం'
W.G: ఆపదలో ఉన్నవారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో దుర్గాపురంకి చెందిన దండెల నాగబాబుకు రూ. 3,50,000 రాయలంకి చెందిన మానుకొండ కిరణ్ కుమార్‌కు రూ. 2,51,288 ఎల్వోసీల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.