రాజధాని నిర్మాణం కోసం తవ్విన గోతుల్లో పడి యువకుడు మృతి
GNTR: రాజధాని నిర్మాణం కోసం తవ్విన గోతుల్లో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణయ్య పాలానికి చెందిన యువకుడు పాఠశాల నుంచి వస్తున్నప్పుడు గోతుల్లో పడి మరణించాడు. నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు రహదారి వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.