VIDEO: జిల్లాలో భారీ పేలుడు.. నలుగురు మృతి
సత్యసాయి: కుమ్మరవాండ్లపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చే డ్రిల్లింగ్ మిషన్‌ను గుర్తించారు. ఈ పేలుడుకు డిటోనేటర్లే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.