సందడిగా ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు

సందడిగా ఉపాధ్యాయుల క్రికెట్  పోటీలు

నర్సీపట్నం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఉపాధ్యాయుల ఆటల పోటీలు సందడిగా సాగుతున్నాయి. సోమవారం నాతవరం వర్సెస్ నర్సీపట్నం జట్లు మీద క్రికెట్ మ్యాచ్ కొనసాగింది. ఈరోజు జరిగిన మ్యాచ్ విజేతలు జిల్లా స్థాయి క్రికెట్ ఆడతారని ఎంఈఓ తలుపులు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు కనీసం క్రికెట్ పాడ్స్ కట్టకుండా మ్యాచ్ ఆడడాన్ని విమర్శించారు.