హార్వెస్టర్‌ పైనుంచి పడి ఒకరి మృతి

హార్వెస్టర్‌ పైనుంచి పడి ఒకరి మృతి

SRCL: ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌పై నుండి కిందపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గూడ సుధాకర్ రెడ్డి 48 అనే వ్యక్తిపై నుండి హార్వెస్టర్ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.