పదవ తరగతి స్పాట్ వాల్యువేషన్ కేంద్రం పరిశీలించిన డీఈవో

అనంతపురం: పట్టణంలోని కేఎస్ఆర్ గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి స్పాట్ వాల్యువేషన్ ప్రక్రియను సోమవారం డీఈవో బి.వరలక్ష్మి, ఏసీ గోవింద నాయక్ లు కలిసి పరిశీలించారు. అదేవిధంగా స్పాట్‌లో పాటించవలసిన నియమ నిబంధనలను సరిగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. అలాగే స్పాట్ లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు