పరివర్తన లైఫ్ సెంటర్‌లో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
నంద్యాల ఎస్సార్బీసీ కాలనీ సమీపంలోని పరివర్తన లైఫ్ సెంటర్‌లో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, కొత్త దుస్తులు, బెడ్లు, బహుమతులు అందజేశారు.