'నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక'

'నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక'

సత్యసాయి జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాల్లో ఈనెల 9న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా 'meekosam.ap.gov.in' వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించాలన్నారు.