బోర్లంలో బీఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం

KMR: బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గురువారం మండల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి గాలి అనిల్ కుమార్‌ను గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాశీరాం పాల్గొన్నారు.