డ్రంక్ & డ్రైవ్.. 424 మందిపై కేసు

డ్రంక్ & డ్రైవ్.. 424 మందిపై కేసు

TG: మద్యం తాగి డ్రైవ్ చేయడం ప్రమాదకరం, నేరమని చెప్తూ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నా మందుబాబుల తీరు మారట్లేదు. ఈ క్రమంలో ఈ నెల 21, 22 తేదీల్లో సైబరాబాద్ పరిధిలో ఏకంగా 424 మంది అడ్డంగా దొరికిపోయారు. వీరిలో 300 మంది ద్విచక్ర, 18 ఆటో, 99 కార్, ఏగురురు హెవీ వాహనదారులు. డ్రంక్ & డ్రైవ్ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా పడే ఛాన్స్ ఉంది.