ఉమ్మారెడ్డిపల్లిలో రెండు లారీలు ఢీ
KDP: ముద్దనూరు మండలం ఉమ్మారెడ్డిపల్లి రింగ్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు లారీ ఇంజిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. రెండు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని ముద్దునూరు 108 వాహన సిబ్బంది ప్రొద్దుటూరుకు తరలించారు.