'శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి'

'శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి'

WNP: అమరచింత మండలం మస్తీపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లభించినట్లు విగ్రహ కమిటీ సభ్యులు మేస్త్రీ సురేశ్, తిరుమలేశ్, మోహన్, పోతు రాము వెల్లడించారు. శనివారం మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరగా అంగీకరించారని తెలిపారు. మంత్రి అనుమతించడంతో విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.