ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
HYD: హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ప్రారంభమైంది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ విశేషాలను తెలిపే ప్రత్యేక సంచికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.