'నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: సింగరేణి సంస్థ CSR ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని RG-3 GM మధుసూదన్, APA- GM నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు వారు VTC స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఉచిత డ్రోన్ టెక్నీషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. 30 మంది నిరుద్యోగ యువతకు 2 వారాలపాటు శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.