నేడు గణేష్ మండపాల నిర్వహకులతో శాంతి సమావేశం

ADB: ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఐ పీ ఎస్ అద్వర్యంలో మంగళవారం మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు, వివిధ ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులతో శాంతి సమావేశం ఉంటుందని ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి గణేష్ ఉత్సవాల నిర్వాహకులు హాజరుకావాలని సూచించారు.