MLA చొరవ.. కార్మికుడి కుటుంబానికి రూ.12 లక్షల సాయం

MLA చొరవ.. కార్మికుడి కుటుంబానికి రూ.12 లక్షల సాయం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన బాలయ్య అప్పారెడ్డిగూడ గ్రామంలో ఉన్న ఓ కంపెనీలో పని చేస్తూ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో MLA వీర్లపల్లి శంకర్ వారి నివాసానికి చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. స్పందించిన యాజమాని తక్షణమే రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.