కొబ్బరి పీచు పరిశ్రమ దగ్ధం.. రూ. 18 లక్షల నష్టం

కొబ్బరి పీచు పరిశ్రమ దగ్ధం.. రూ. 18 లక్షల నష్టం

కాకినాడ: కోలంక గ్రామంలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొబ్బరి పీచు పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. ఎగుమతికి సిద్ధంగా ఉన్న సుమారు రూ. 15 లక్షల విలువైన పీచుతో పాటు రూ.3 లక్షల విలువైన జనరేటర్, మోటార్లు కాలిపోయాయి. కాకినాడ, రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం రూ. 18 లక్షల మేర ఆస్తి నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.