ఆలయంలో భారీ చోరీ కలకలం

ఆలయంలో భారీ చోరీ కలకలం

SRD: రామచంద్రాపురం మండలంలోని అశోక్‌నగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని 6 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు మరియు రూ.90 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.