ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 10 లక్షలు మంజూరు
CTR: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 10 లక్షలు మంజూరు చేయడం జరుగుతుంది అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు.