19న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
SRPT: ఈనెల 19న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు సూర్యాపేటలోని లేడీ డీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుండూరి కృపాల్, ఎల్. సతీష్ కుమార్ తెలిపారు. అండర్- 7, 11, 19 విభాగాలలో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు.