RTC DMకు వినతిపత్రం అందజేసిన ABVP నేతలు
BHPL: టేకుమట్లు మండలం ఏంపేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని జమ్మికుంట RTC DMకు సోమవారం ABVP నాయకులు అనిల్, అంజి బన్నీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చదువుకుంటున్న విద్యార్థులు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ABVP నేతలు ఉన్నారు.