వరద తీవ్రత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోండు శంకర్

శ్రీకాకుళం: జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్ష ప్రభావం వలన నీటమునిగిన ప్రాంతాలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ బుధవారం పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విపత్తులు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు.