VIDEO: గూడెం దేవాలయంలో కార్తీకమాస పూజలు
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం శుక్ల ద్వాదశి కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని దేవాలయం ఆవరణలో ఉన్న తులసి చెట్టు వద్ద దీపాలను వెలిగించారు.