అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మంత్రి
PDPL: బాలల దినోత్సవం సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్ మండలంలో పర్యటించారు. పైడిపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలతో సరదాగా మాట్లాడి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీలో ఉన్న సౌకర్యాలు, పోషకాహార పంపిణీ, చిన్నారుల సంరక్షణ విధానాలను మంత్రి పరిశీలించారు.