ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే భగత్

NLG: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ బీఆర్‌ఎస్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామంలోనూ ముసాయిదా జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన కోరారు. గల్లంతైన ఓట్లను గుర్తించి, వాటిని తిరిగి జాబితాలో ఆగస్టు 31లోగా అభ్యంతరాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు.