ప్రమాదవశత్తు బావిలో పడి మహిళా మృతి

ప్రమాదవశత్తు బావిలో పడి  మహిళా మృతి

JGL: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ముత్యంపేటకు చెందిన సంత లక్ష్మి అలియాస్ వసంత (43) ఇంటి సమీపంలోని తన మక్క పెరటిలో కోతులు, పక్షుల కావలికి వెళ్ళింది. అయితే బావి ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతిచెందింది.