'దళిత యువకుడిపై దాడి అమానుషం'

VZM: తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నాయకుడి దాడి అమానుషమని జిల్లా TDP అధ్యక్షులు, DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కార్యాలయంలో దళిత యువకులను బంధించి, క్రూరంగా కొట్టడం అమానుషమని, దానిని వీడియోలు తీయడం అత్యంత దారుణమన్నారు.