జాతీయ రహదారిపై రైతన్నల ధర్నా

జాతీయ రహదారిపై రైతన్నల ధర్నా

ADB: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. ఈ రోజు నేరడిగొండ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పత్తి తేమ 20% సోయా తేమను 18% పెంచాలని అలాగే పత్తి ఎకరానికి 12 క్వింటాళ్లు, సోయా ఎకరానికి 10 క్వింటల్లా చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాము ఏర్పడింది.