గాంధీ పేరు తొలగింపుపై పార్లమెంట్ ఆవరణలో నిరసన
TG: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది కేవలం ప్రజలకు గాంధీని దూరం చేసే చర్య కాబట్టి ధర్నా చేపడుతున్నామని వెల్లడించారు.