అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
WGL: వరంగల్ రామనాథపురికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు చిదురాల విజయరాణి (55) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందింది. ఆమె పైడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. చిన్న కుమార్తె పూజకు కుమారుడు పుట్టడంతో గత నవంబరులో అమెరికా వెళ్లింది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుముసింది.