మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం
ATP: గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామానికి చెందిన కురుబ దేవేంద్ర, ఎస్సీ కాలనీకి చెందిన భీమన్నగారి ప్రతాప్ దురదృష్టవశాత్తు ఒకే రోజు మృతి చెందారు. ఈ విషాద సమయంలో ADCC బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి కుటుంబాలకు అండగా నిలిచారు. పేద కుటుంబాల అంత్యక్రియల ఖర్చుల కోసం చెరో రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు.