పుట్టపర్తికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం తెల్లవారుజామున పుట్టపర్తికి విచ్చేశారు. విమానాశ్రయం వద్ద ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితర నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీతో కలిసి కిషన్ రెడ్డి ఈరోజు జరిగే ముఖ్య కార్యక్రమంలో పాల్గొననున్నారు.