ఈనెల 31నుంచి CITU మహాసభలు
GNTR: విశాఖలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరిగే సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ పిలుపునిచ్చారు. పెదకాకానిలో శంకర్ కంటి ఆసుపత్రి, బొమ్మిడాల క్యాన్సర్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో సోమవారం ఆయన సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.