గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం
NZB: రెంజల్ మండలం నీలా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలు విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్యులు, నీలా సర్పంచ్ క్యాతం యోగేష్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.