'లింగ వివక్షతను అరికట్టాలి'
VZM: సమాజంలో ఉన్న లింగ వివక్షతను అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్. జీవనరాణి అన్నారు. ఈ మేరకు స్థానిక డిఎంహెచ్‌వో కార్యాలయంలో "లింగ వివక్షత ఆధారిత హింస నివారణ, సామర్థ్య పెంపుదల" అనే అంశంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీపీఎన్డిటీ చట్టంపై అవగాహన కల్పించారు.